మారుతి దర్శకత్వంలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. కామెడీ, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
Also Read: Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!
ది రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడా? అని రెబల్ ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు (డిసెంబర్ 27) భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సాయత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈవెంట్ లైవ్‌ను ప్రముఖ తెలుగు ఛానెల్ ‘ఎన్టీవీ’ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.