Venu Goapl Reddy
Author- NTV Telugu-
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు కట్టబెట్టారు. -
Ayodhya Temple: ‘‘రాబోయే 1000 ఏళ్లు భారత్‌లో రామరాజ్యం’’.. రామ మందిరంపై బీజేపీ తీర్మానం..
Ayodhya Temple: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదిక బీజేపీ జాతీయ సమావేశం జరుగుతోంది. భారతదేశంలో రాబోయే వెయ్యేళ్లకు రామరాజ్య స్థాపనకు ఇది నాంది పలుకుతూ, అయోధ్య రామ మందిరంపై ఆదివారం బీజేపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ చైతన్యంగా దేవాలయం మారిందని తీర్మానం పేర్కొంది. ‘‘ పురాతన పవిత్ర నగరమైన అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో దివ్యవమైన ఆలయాన్ని నిర్మించడం దేశానికి ఒక చారిత్రక, అద్భుత విజయమని, ఇది భారతదేశంలో రాబోయే 1000 ఏళ్ల రామ రాజ్య స్థాపనను తెలియజేస్తుంది. ’’ అని… -
Karnataka: బడ్జెట్లో ముస్లింకు కొంచెం ఎక్కువ ఇచ్చాం.. వివాదాస్పదమైన మంత్రి వ్యాఖ్యలు..
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు. -
PM Modi: “రానున్న 100 రోజులు కీలకం”.. లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని దిశానిర్దేశం..
PM Modi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీయేకు 400పైగా సీట్లు రావాలంటే, బీజేపీ 370 సీట్లు గెలవాల్సి ఉందని ఆయన అన్నారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ అన్నారు. నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదని అన్నారు. -
BCAS: ల్యాండింగ్ అయిన 30 నిమిషాల్లో ప్రయాణికుల లగేజీ ఇవ్వాలి.. ఎయిర్‌లైన్స్‌కి ఆదేశం..
BCAS: ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. చెక్-ఇన్ కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్లు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా బ్యూరో ఆప్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) దేశంలోని 7 విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..
Bees attack: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. పెళ్లికి పిలువని ఆహ్వానితులుగా తేనెటీగలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాహానికి హాజరైన బంధువులు ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుణ జిల్లాలో ఒక వివాహ వేడుకలో జరిగింది. హోటల్ పైకప్పుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో తేనెటీగలు విరుచుకుపడటంతో వాటి నుంచి తప్పించుకునేందేకు పెళ్లికి హాజరైన బంధువులు ఎటుపడితే అటు పరుగెత్తారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. -
S Jaishankar: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తీవ్రవాదమే.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Sandeshkhali: సందేశ్‌ఖలీ అత్యాచార ఘటనలో టీఎంసీ నేత అరెస్ట్..
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ గత కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మహిళలు, యువత టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ పార్టీ నుంచి సపోర్టు లభిస్తోంది. -
Jnanpith Award: గుల్జార్, జగద్గురు రాంభద్రాచార్యలకు జ్ఞానపీఠ్ అవార్డు
Jnanpith Award: 2023కి గానూ ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలకు 58వ జ్ఞానపీఠ్ అవార్డులను కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీ సినిమాల్లో సినీగేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఉన్న ప్రసిద్ధ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు గుల్జార్‌కి 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. -
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చిలో గుడ్‌న్యూస్.. డీఏ 4 శాతం పెరిగే ఛాన్స్..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!