Al-Nukhba Force: ఇజ్రాయిల్ కలలో కూడా ఊహించని విధంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకరదాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పైకి నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించమే కాకుండా, ఇజ్రాయిల్ లోకి పారా గ్లైడర్ల ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిని దారుణంగా హతమార్చారు. 40 మంది చిన్నారుల తలలు నరికి హత్య చేయడాన్ని ఇజ్రాయిల్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.
Palestine: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Putin: గతేడాది ఫిబ్రవరి తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సొంత దేశం వదిలి వేరే దేశ పర్యటనకు వెళ్లారు. యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ
Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఇప్పుడు AI వినియోగం పెరిగింది.
live-in relationship: శ్రద్ధా వాకర్ దారుణ హత్య.. లివ్-ఇన్ రిలేషన్షిప్ లోని భయకర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అతి కిరాతకంగా నరికి ఫ్రిజులో పెట్టిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న పలువురు యువతులు హత్యలకు గురవ్వడమో, లేకపోతే హింసించబడటమో జరిగింది. లివ్ ఇన్ లో ఉన్న యువతులు తమను పెళ్లి చేసుకోవాలని కోరడం హత్యలకు దారి తీశాయి. కొన్ని కేసుల్లో తమ మతంలోకి మారితేనే పెళ్లి…
China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
Joe Biden: హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. ఒకే ప్రాంతంలో 40 మంది పిల్లల తలలను తెగనరికారు. ఈ క్రూరమైన దాడితో ఇజ్రాయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. హమాస్‌ని లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Israel-Hamas War: శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. గాజాలోని బిల్డింగులతో పాటు యూనిర్సిటీలు, మసీదులు ఇలా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ మరణాల సంఖ్య 3000కి చేరింది. ఇజ్రాయిల్ లో 1200 మందికి పైగా మరణించారు. అంతేస్థాయిలో గాజాలోని ప్రజలు మరణిస్తున్నారు.
Operation Ajay: ఇజ్రాయిల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం, ఇజ్రాయిల్ లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. ఇజ్రాయిల్ లో భారతీయులు 18,000 మంది ఉన్నారు. ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రసంస్థ మెరుపుదాడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. పటిష్ట నిఘా వ్యవస్థ, సైన్యం ఉన్న ఇజ్రాయిల్ కూడా ఈ దాడిని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. పారా గ్లైడర్లు, బుల్డోజర్ల ద్వారా ఇజ్రాయిల్ సరిహద్దు దాటి లోపలకి వచ్చిన హమాస్ ఉగ్రమూకలు దొరికిన వారిని దొరికినట్లు చంపేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోయారు.