Palestine: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Putin: అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్.. తొలిసారిగా విదేశీ పర్యటనకు రష్యా అధినేత పుతిన్..
మా విధానం దీర్ఘకాలంగా స్థిరంగా ఉంది, పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించడానికి, సురక్షితమైన, గుర్తింపు పొందిన సరిహద్దుతలతో, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా పక్కపక్కన నివసించే దిశగా ప్రత్యక్ష చర్యల పునరుద్ధరణకు భారతదేశం ఎల్లప్పుడు సమర్థిస్తుందని బాగ్చీ చెప్పారు. ఇజ్రాయిల్, గాజాలోని మానవతా పరిస్థితిని గురించి ప్రశ్నించగా.. మనవతా చట్టాన్ని పాటించడం సార్వత్రిక బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానితో పోరాడాల్సిన బాధ్యత ఉందని ఆయన వెల్లడించారు.