Israel-Hamas War: ఇజ్రాయిల్ పై దాడి చేసి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని హతమార్చింది హమాస్ ఉగ్రవాద సంస్థ. హమాస్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఇదిలా ఉంటే హమాస్ జరిపిన అనాగరిక హత్యల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. హమాస్, ఐసిస్ కన్నా హీనంగా ఉందని విమర్శించారు. ఒక జాతిని నిర్మూలించాలనుకున్న ఉగ్రవాదులే ఇలాంటి భయానక ఘటనలకు పాల్పడుతారని అన్నారు.
Israel: ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, ఇతర దేశస్తులను బందీలుగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిని రక్షించేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు బ్రిటీష్ పత్రికి ది టెలిగ్రాఫ్ నివేదించింది. దాదాపుగా 100 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదులు చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రపంచంలో అతిశక్తివంతమైన, ఇజ్రాయిల్ ప్రత్యేక ఆపరేషన్స్ దళం సయెరెట్ మత్కల్ సిద్ధమైనట్లు సమాచారం.
Terrorists: విదేశీ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాదులను పిట్టల్లా రాలిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చనిపోయేది మాత్రం ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. తాజాగా 2016 పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో బుధవారం హతమయ్యాడు. గుర్తుతెలియని దుండగులు లతీఫ్ ని కాల్చి చంపారు.
World Cup 2023: ప్రపంచ కప్ 2023లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 345 భారీ టార్గెట్‌ని సునాయసంగా ఛేదించింది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తో పాటు అబ్దుల్లా షఫీక్ సెంచరీలతో చెలరేగి పాక్ విజయంలో కీలకంగా మారారు. రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేశాడు.
S JaiShankar: హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.
Bhupesh Baghel: సీరియస్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి క్యాండీక్రష్ గేమ్ ఆటడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మరెవరో కాదు ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరైన బఘేట్ తీరిగ్గా ఆయన మొబైల్ తీసి క్యాండీ క్రష్ గే
Rajasthan: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన క్యాబ్ డ్రైవర్ని అత్యంత ఘోరంగా కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మహిపాల్పూర్ ప్రాంతంలో జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బిజేంద్ర ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై మరణించారు.
Titanic Submersible: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి