Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఇప్పుడు AI వినియోగం పెరిగింది.
అయితే, 2027 నాటికి విద్యుత్ శక్తితో కూడిన AI సంబంధితక కార్యకలాపాలు నెదర్లాండ్స్, అర్జెంటీనా, స్వీడన్ వంటి దేశాల వార్షిక విద్యుత్ డిమాండ్లను అధిగమించగలవని కొత్త పరిశోధన తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పవర్ ని తీసుకుంటోంది. ఏఐ సాధనాలకు శిక్షణ ఇవ్వడం అనేది శక్తితో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే పెద్ద మొత్తంలో డేటా అందించడం అవసరం అని నెదర్లాండ్స్ లోని రైయ్ యూనివర్సిటీ పరిశోధక రచయిత లెక్స్ డి వ్రీస్ అన్నారు. దీనికి సంబంధించిన పరిశోధన జూల్ జర్నర్ లో ప్రచురించబడింది.
Read Also: Vijay Devarakonda: లైగర్ రిజల్ట్ చూశాక కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడంటే.. ఏం గుండెరా అది..?
టెక్చువల్ కంటెంట్ జనరేటింగ్ AI టూల్ కోసం, న్యూయార్స్ AI కంపెనీ హగ్గింగ్ ఫేస్ 433 మెగావాట్ అవర్( MWh) కరెంట్ ని వినియోగించినట్లు నివేదించింది. ఇది ఒక సంవత్సరంలో 40 సగటుల అమెరికన్ ఇళ్లు వాడే శక్తికి సమానం. AI సాధనాలు గణనీయమైన మొత్తంలో కంప్యూటింగ్ శక్తిని తీసుకుంటాయి. ప్రతీసారి అవి ప్రాంప్ట్‌ల ఆధారంగా టెక్ట్స్ లేదా ఇమేజ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ChatGPT అమలు చేయడానికి రోజుకు 564 MWh విద్యుత్తు ఖర్చు అవుతుందని డి వ్రీస్ విశ్లేషణలో తేలింది.
ప్రస్తుతం రోజుకు 9 బిలియన్ల సెర్చ్‌లను గూగుల్ ప్రాసెస్ చేస్తుంది. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లను AIతో శక్తివంతం చేయాలనుకుంటే.. దానికి ఏడాదికి 30 టెరావాట్ అవర్(TWh) శక్తి అవసరం అవుతుందని డివ్రీస్ అంచనా వేసింది. ఇది ఐర్లాండ్ విద్యుత్ వినియోగంతో సమానం. దీంతో 2027 నాటికి ప్రపంచ వ్యాప్తంగా AI- సంబంధిత విద్యుత్ వినియోగం ఏటా 85 నుండి 134 TWh వరకు పెరుగుతుందని, AI- సర్వర్ ప్రొడక్షన్ రేట్ ప్రొజెక్షన్ ఆధారంగా డి వ్రీస్ చెప్పారు.