Al-Nukhba Force: ఇజ్రాయిల్ కలలో కూడా ఊహించని విధంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకరదాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పైకి నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించమే కాకుండా, ఇజ్రాయిల్ లోకి పారా గ్లైడర్ల ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిని దారుణంగా హతమార్చారు. 40 మంది చిన్నారుల తలలు నరికి హత్య చేయడాన్ని ఇజ్రాయిల్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ దాడిలో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ఎలైట్ ఫోర్స్ ‘అల్-నుఖ్బా’ ఫోర్స్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఈ నరరూప దళాన్ని టార్గెట్ చేస్తోంది. అల్-నుఖ్బా అంటే అరబిక్ లో ఎలైట్ అని అర్థం. ఈ ‘అల్-నుఖ్బా’ హమాస్ సైనిక విభాగమైన ఇజ్ అల్-దిన్అల్- కస్సామ్ బ్రిగేడ్స్ ర్యాంకులో ప్రధాన పోరాట విభాగం.
Read Also: Palestine: స్వతంత్య్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇండియా మద్దతు..
అత్యాధునికి శిక్షణ, సాంకేతిక నైపుణ్యం కలిగిన వారిని ఈ దళంలోకి తీసుకుంటారు. అల్-నుఖ్బా అనేది ఎంపిక చేయబడిని హమాస్ ఉగ్రవాదుల చేత ఏర్పడింది. ఆకస్మిక దాడులు, చొరబాట్లు, యాంటి ట్యాంక్ మిస్సైల్, స్నైపర్, రాకెట్ దాడుల వంటి తీవ్రవాద చర్యలు చేపట్టే విధంగా శిక్షణ పొందిన దళంగా పేరు. దీంతో పాటు ఈ దళం సీనియర్ హమాస్ నాయకుల రక్షణలో కూడా పాలుపంచుకుంటుంది.
అల్-నుఖ్బా సభ్యులు ఆయుధాలు,పేలుడు పదార్థాల నిర్వహణ, స్కూబా డైవింగ్ మరియు హ్యాండ్-టు హ్యాండ్ కంబాట్ వంటి వివిధ విభాగాలలో కఠినమైన శిక్షణ పొందుతారు. అధునాతన అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ రైఫిల్స్, మెషిన్ గన్‌లు, రాకెట్ పొపెల్డ్ గ్రెనేడ్స్ వంటి వాటిలో వినియోగంలో కఠినమైన శిక్షణ పొంది ఉంటారు. 2014లో అల్-నుఖ్బా యూనిట్ గాజా యుద్ధంలో పాల్గొంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్-నుఖ్బా దళాల సంఖ్య పెరిగింది.