Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా బయట అడుగుపెట్టాడు. ఇటీవల కిర్గిజ్‌స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన పుతిన్ అటునుంచి అటుగా చైనా పర్యటనకు వెళ్లాడు. చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన “బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)” ప్రాజెక్టు ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, పుతిన్ కి సాదరస్వాగతం పలికారు.
తాజాగా బుధవారం బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో పలువురు ప్రపంచ నాయకులతో పాటు 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరి ఆధ్వర్యంలో చైనా వేడుకలను ప్రారంభించింది. ఈ సమావేశంలో పుతిన్ వేదికను పంచుకున్నారు. ఇదిలా ఉంటే పుతిన్ వేదికపై మాట్లాడే సమయంలో పలువురు యూరప్ ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు. కార్యక్రమం జరిగే వేదిక నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రతినిధులతో ఫ్రాన్స్ మాజీ ప్రధాని జీన్ పియర్ రాఫరిన్ కూడా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడి ఆహ్వానానికి థాంక్స్ చెప్పారు. పురాతన సిల్క్ రోడ్ ఆధునిక పునరుద్ధరణలో రష్యా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. రష్యా,చైనాలు ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే సార్వత్రిక, స్థిరమైన, దీర్ఘకాలకి పురోగతి, సామాజిక శ్రేయస్సు సాధించడానికి సహకరించుకుంటాయని రష్యా అధ్యక్షుడు చెప్పారు.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పుడే రష్యా అధ్యక్షుడు పుతిన్ వేరే దేశాల పర్యటనలకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధనేరాలకు పాల్పడుతున్నాడని చెబుతూ.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి హాజరుకాలేదు, అలాగే భారత్ నిర్వహించిన జీ20 సమావేశానికి కూడా హజరుకాలేదు. ఈ రెండు సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. అయితే జీ20 సమావేశంలో తన మిత్రదేశం భారత్ ని ఇబ్బంది పెట్టకూడదనే రాలేదని ఇటీవల పుతిన్ చెప్పారు.
Jean-Pierre Raffarin, représentant de la France au forum des nouvelles routes de la soie à Pékin, quitte la salle avant le discours de Vladimir Poutine. "Pas d’interaction avec les Russes sous quelque forme que ce soit", avance-t-on côté français. pic.twitter.com/Id5jN9ETAE
— Frédéric Schaeffer (@fr_schaeffer) October 18, 2023