Mahua Moitra: పార్లమెంట్ లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని, ఇందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, ఖరీదైన గిప్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో మోయిత్రా 61 ప్రశ్నలు అడిగితే 50 ప్రశ్నలు అదానీ గ్రూపు గురించే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ సమాచారాన్ని కూడా సదరు వ్యాపారవేత్తతో పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Also: Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి వ్యాపారవేత్త హీరానందనీ అఫిడవిట్ సమర్పించినట్లు వార్తలు రావడంతో మహువా మోయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం హీరానందానీపై ఒత్తిడి తీసుకువచ్చి, తెల్లకాగితంపై సంచతం చేయించిందని ట్విట్టర్ ద్వారా ఆరోపిచింది. అఫిడవిట్ విశ్వసనీయతను మహువా ప్రశ్నించారు. ‘సదరు అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో ఏదు.. దానిని హీరా నందాని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయలేదు, ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఈ సమాచారం లీక్ అయింది, అదానీని ప్రశ్నించే ధైర్యం చేసే ప్రతీ నేతనను అణిచివేసే కుట్రలో ఇది భాగం’ అని మహుమా ప్రశ్నించారు.
దర్మన్ తండ్రి భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకదానిని నడుపుతున్నారు, యూపీ, గుజరాత్ లో వారి ఇటీవల ప్రాజెక్టులకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం, ప్రధానమంత్రి ప్రారంభించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. దర్శన్ ఇటీవల తన వ్యాపార ప్రతినిధి బృందంలో భాగంగా విదేశాలకు ప్రధానితో కలిసి వెళ్లారని ఆమె తెలిపారు. ఇటు వంటి సంపన్న వ్యాపారవేత్తలు నేరుగా పీఎంతో, ప్రధానితో సంబంధాలు కలిగి ఉంటారు, ప్రతిపక్ష ఎంపీ తనకు బహుమతులు ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. హీరానందనా వాననలను ఒప్పుకున్నట్లయితే అధికారికంగా లేఖను ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు.