Imran Khan: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూదులకు సన్నిహితుడు కావడం వల్లే ఇమ్రాన్ ఖాన్‌పై ఇస్లామిక్ తీవ్రవాదులు హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. యూదు మూలానికి చెందిన జెమీయా, ఇమ్రాన్ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారారు. ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా ఇమ్రాన్ ఖాన్ పై కొందరు ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వల్ప గాయాలతో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
యూదుడిగా ఉంటూ ముస్లింను వివాహం చేసుకోవడం వల్ల ఈ సమస్యపై తనకు ప్రత్యేకమైన దృక్ఫథం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. యూదు సంతతి తల్లి, ముస్లిం వ్యక్తికి జన్మించిన తన పిల్లలు పాకిస్తాన్ లో సెమిటిజం, యూకేలో ఇస్లామోఫోబియాను ఎదుర్కొన్నారని జెమీమా చెప్పారు. ‘‘నేను ఓ ముస్లిందేశంలో పదేళ్లుగా నివసిస్తున్నాను. గాజా, వెస్ట్ బ్యాంక్‌కి వెళ్లాను. ఇజ్రాయిల్ తో నాకు చారిత్రాత్మక కారణంగా లెక్కలేనన్న మరణ బెదిరింపులను ఎదుర్కొన్నాను. సెమిటిజాన్ని ఎదుర్కొన్నాను.’’ అని జెమీయా వ్యాఖ్యానించారు.
వేలాది మంది అమాయక పిల్లలను చంపడం, అంగవైకల్యం చేయడం వల్ల బందీలను రక్షించలేరు, శాంతిని తీసుకురాదని, 9/11 దాడుల తర్వాత ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన యుద్ధాలు మరింత ఉగ్రవాదాన్ని, సురక్షితంగా లేని ప్రపంచాన్ని మాత్రమే సృష్టిస్తుందని జేమియా తన పోస్టులో పేర్కొంది.