PM Modi: భారత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగాత్మకంగా ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) పరీను శనివారం విజయవంతంగా నిర్వహించింది. క్రూమాడ్యుల్‌ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు, ఆ తరువాత క్రూ మాడ్యుల్, రాకెట్ నుంచి విడిపోయి పారాశ్యూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా పడింది.
టీవీ-డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష కార్యక్రమం దిశగా మరో అడుగు దగ్గరగా తీసుకెళ్లిందని ఆయన శనివారం అన్నారు. ‘‘ఈ ప్రయోగం భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం గగన్‌యాన్‌ను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళుతుంది. ఇస్రోలోని మన శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు.’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also: Mahua Moitra: మహువా మోయిత్రా ఢిల్లీలో ఉంటే, దుబాయ్‌లో ఎలా లాగిన్ అయ్యారు..? బీజేపీ ఎంపీ మరో ఆరోపణ..
ఇస్రో ‘గగన్‌యాన్’ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయాలని సంకల్పించుకుంది. దీనికి తగ్గట్లుగా ప్రయోగాలను నిర్వహిస్తోంది. తాజాగా టీవీ-డీ1 ప్రయోగాన్ని ఈ రోజు చేపట్టింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్య రావడంతో, 10 గంటలకు విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగంలో క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) ద్వారా వ్యోమగాములు భూమిపై ల్యాండ్ అయ్యే విధానాన్ని పరీక్షించారు.
This launch takes us one step closer to realising India’s first human space flight program, Gaganyaan. My best wishes to our scientists at @isro. https://t.co/6MO7QE1k2Z
— Narendra Modi (@narendramodi) October 21, 2023