5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలో పోరాడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.
Israel-Hamas War: 20 రోజుల నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరు తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. ఇజ్రాయిల్ నుంచి 200కు పైగా ప్రజలను బందీలుగా హమాస్ ఉగ్రవాదులు గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజస్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ యుద్ధం మధ్యప్రాచ్యంతో పాటు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
Salmonella Outbreak: అమెరికాను సాల్మొనెల్లా బ్యాక్టీరియా కలవరపెడుతోంది. సాల్మొనెల్లా వ్యాప్తి 22 అమెరికా రాష్ట్రాల్లో 73 మందిని ప్రభావితం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) ప్రకారం ఈ వ్యాప్తికి ముక్కలుగా చేసిన ఉల్లిపాయాలు కారణమవుతున్నాయని తేలింది. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రి పాలయ్యారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’కేసులో పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ నుంచి డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. ఇలా లంచం తీసుకుని ప్రధాని మోడీను ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని,
Tiger claw row: ‘పులిగోరు’ వివాదం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ టీవీ లైవ్ షో ఇంటర్వ్యూలో పులి-గోరు లాకెట్ ధరించి కనిపించడంతో అతని ఇంట్లో అటవీ శాఖ సోదాలు చేసింది. అంతకుముందు కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఇలాంటి లాకెట్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఇంట్లో కూడా అటవీ శాఖ సోదాలు నిర్వహించింది.
ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదలు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత […]
Qatar: ఏడాది కాలంగా నిర్భంధంలో ఉన్న 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు అన్ని చట్టపమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది.
Pakistan: వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వదిలివెళ్లాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులందరూ.. నవంబర్ 1 కంటే ముందే దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ గురువారం చివరిసారిగా హెచ్చరించింది.