Kangana Ranaut: ఇజ్రాయిల్‌కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్‌ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీ నూర్ గిలోన్ జీతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ రోజు ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.నిన్న నేను రాహన దహనం కోసం ఢిల్లీలో ఉన్నాను. నేటి ఆధునిక రావణుడు హమాస్ లాంటి ఉగ్రవాదులు ఏరివేస్తున్న ఇజ్రాయిల్ రాయబారిని కలవాలని నిన్న అనుకున్నాను. చిన్న పిల్లలను, మహిళల్ని టార్గెట్ చేస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఈ టెర్రరిజంపై ఇజ్రాయిల్ యుద్ధంలో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. తనతో నా అప్ కమింగ్ సినిమా ‘తేజస్’ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఫైటర్ జెట్ తేజస్ గురించి చర్చించాను’’ అని కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Iran: “హిజాబ్” ఉల్లంఘన.. సినిమాల్లో నటించకుండా 12 మందిపై నిషేధం..
తనను కలిసేందుకు వచ్చని కంగనా రనౌత్ ఫోటోలను ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆమె ఇజ్రాయిల్ కి మద్దతు తెలపడం, రాయబార కార్యాలయాన్ని సందర్శించడం మాకెంతో ప్రత్యేకమైందని, తనకే కాకుండా ప్రధాని నరేంద్రమోడీకి, ఉగ్రవాదంలో వ్యతిరేకంగా తిరుగులేని మద్దతు కోసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపానంటూ ఆయన కామెంట్స్ చేశారు.
భారతదేశంలో ఇజ్రాయిల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ హిషన్, ఓహద్ నకాష్ కైనార్ కూడా కంగనా సమావేశమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ భయంకర సమయంలో కొంతమంది మద్దతు ధైర్యంగా ఉంది. దానికి వేరే పదం లేదు. కంగనాలా నిజం చెప్పేందుకు ధైర్యం కావాలని ఇజ్రాయిల్, భారత్ ఒకే విలువలను, ధైర్యాన్ని పంచుకుంటాయి, జైఇజ్రాయిల్, జైహింద్ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. పిల్లలు, మహిళలతో సహా 1400 మందిని చంపేశారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో సహా సాధారణ ప్రజలు మొత్తంగా 5700 మంది మరణించారు.
It was lovely meeting @KanganaTeam who was in Delhi for her movie premiere & visited our embassy to extend her support to @Israel.
I expressed our heartfelt gratitude not only to her but also to PM @narendramodi ji and our Indian friends for their unwavering support in our… pic.twitter.com/SegcrOQnli
— Naor Gilon🎗️ (@NaorGilon) October 25, 2023
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!