Mumbai: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
- ముంబై భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- రివర్స్ తీస్తున్న BEST బస్సు అదుపు తప్పి ప్రజలను ఢీకొట్టిన ఘటన
- ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి
- మరో 10 మందికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్ పరిసరాల్లో BEST బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ప్రమాద సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక శాఖ, పోలీసులు, BEST సిబ్బంది, 108 అంబులెన్స్‌లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులకు శ్రమించాల్సి వచ్చింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రమాదంలో గాయపడిన వారిని, మృతులను రాజావాడీ బీఎంసీ ఆస్పత్రి, ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రులకు తరలించారు. రాజావాడీ ఆస్పత్రిలో 31 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహంగా తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే 51 ఏళ్ల ప్రశాంత్ లాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రిలో మరో ముగ్గురిని వైద్యులు మృతులుగా ప్రకటించారు. ప్రస్తుతం 9 మంది గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.
BEST bus ran over 4-5 people (count unconfirmed) at Bhandup West Station Road area in Mumbai pic.twitter.com/jzoImgpEP2
— Rahul (@rahulrsawant) December 29, 2025
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!