5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలో పోరాడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్ దాడుల్లో 50 మంది బందీలు చనిపోయారు.. హమాస్ ప్రకటన..
తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వసర్మకు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలకు ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం సాయంత్రంలోగా సమధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గడువు ముగిసేలోపు ఇరువురు నేతలు స్పందించకుంటే, మళ్లీ వారిని సంప్రదించకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం హిమంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 18న ఛత్తీస్‌గఢ్ కవర్ధాలో హిమంత, అక్బర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు ప్రియాంకాగాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వచ్చే నెలలో ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.