Pakistan: ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ మరో వార్నింగ్.. నవంబర్ 1 డెడ్‌లైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వదిలివెళ్లాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులందరూ.. నవంబర్ 1 కంటే ముందే దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ గురువారం చివరిసారిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోని అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబర్ 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరిని తొలగించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది.
పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్లలో ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారని తేలడంతోనే ఈ నిర్ణయం తసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించామని, గడువులోగా స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని మంత్రి బుగ్తీ మరోసారి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత అక్రమవలసదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ చేపడుతుందని అన్నారు. వలసదారులను దాచిపెట్టడంలో ప్రేమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
Read Also: Rahul Gandhi: 2024లో పీఎం రాహుల్ గాంధీనే.. మిత్రపక్షం విమర్శలు..
వలసదారుల్లో ఎక్కువగా ఆఫ్ఘన్లు చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాలో వీరు ఉంటున్నారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై రష్యా దండయాత్ర తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్లు పాకిస్తాన్ లోకి వచ్చారు. యుద్ధం, సంఘర్షణను తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు పాకిస్తాన్ లోకి వచ్చారు. అనేక మంది ప్రభుత్వం, యూఎన్ ఏజెన్సీల వద్ద శరణార్థులుగా నమోదు చేయబడ్డారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యంగా సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారీ పేలుళ్లు జరిగాయి. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ లో ఓ మతపరమైన కార్యక్రమంలో బాంబు పేలుడు కారణంగా 50 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉంటే భారత్ కి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పలువురు ఉగ్రవాదుల్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే ఈ ఘటనల్లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం ఉన్నట్లు పాక్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారుల్ని, ముఖ్యంగా ఆఫ్ఘన్లను దేశం వదిలేయాలంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!