Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar: ఏడాది కాలంగా నిర్భంధంలో ఉన్న 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి ఖతార్ మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు అన్ని చట్టపమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది. శిక్ష విధింపబడిన 8 మంది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అయిన దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు.
Read Also: KS Ratnam: బీఆర్ఎస్ కు భారీ షాక్.. రేపు బీజేపీలో చేరనున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఏడాదిగా నిర్భంధంలో ఉంటున్న వీరు పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా అనేక సార్లు తిరస్కరించారు. వారి నిర్బంధాన్ని ఖతార్ అధికారులు పొడగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఈ రోజు వీరికి మరణశిక్ష విధించింది. ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులు, న్యాయనిపుణులతో టచ్ లో ఉన్నామని చెప్పింది.
వీరిపై గూఢాచర్య అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ తరుపున ఓ జలంతర్గామి ప్రోగ్రామ్ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు అభియోగాలు మోపి ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఈ కేసును రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్ట్ తో పాటు అతని భాగస్వామని దేశం వదిలి వెళ్లమని ఖతార్ అధికారులు ఇటీవల ఆదేశించారని తెలిసింది. ప్రస్తుతం మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, కమాండర్లు అమిత్ నాగ్‌పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. వీరిపై గతేడాది ఆగస్టులో ఖతార్ అభియోగాలు మోపింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!