Parliament Panel: వలసవాద కాలం నాటి క్రిమినల్ చట్టాల సవరణలో భాగంగా వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయ శిక్షాస్మృతి- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు భారతీయ సాక్ష్యాధారాల చట్టం - భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, మరియు భారతీయ సాక్ష్యా అధినియం వంటి మూడు బిల్లులను ఈ ప్యానెల్ అధ్యయనం చేస్తోంది.
Tata To Make iPhones: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 115 ఏళ్ల టాటా సంస్థ ఉప్పు నుంచి టెక్నాలజీ దాకా ఎన్నో రంగాల్లో ఉంది. ఇకపై టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. టాటా గ్రూప్ రెండున్నరేళ్లలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఇది భారతదేశ ఉత్పత్తి నైపుణ్యం సత్తాను చాటనుంది.
Jammu Kashmir: జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ కాశ్మీర్ పురోగతిపై చర్చించారు.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న మొదలైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపారు, 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్, భూతల దాడులకు సిద్ధమవుతోంది.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో భార్యభర్తల గొడవ కొడుకును నేరస్తుడిగా మార్చింది. తన తల్లిని బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడనే కోపంతో తండ్రిని హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని పాలము జిల్లాలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు గడిచాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజలను ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. దాదాపుగా 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా తీసుకుని గాజాలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు.
MK Stalin: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకేగా వ్యవహారం నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవిని టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వెళ్లిపోవాలంటూ గతంలో డీఎంకే శ్రేణులు పోస్టర్లు కూడా అంటించారు. ఇటీవల రాజ్ భవన్ ప్రధాన గేటు ముందర ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులను పేల్చడం మరోసారి రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైంది. బీజేపీ చీఫ్ అన్నామలై, డీఎంకే పార్టీనే ఇలా స్పాన్సర్ చేస్తూ దాడులకు ఉసిగొలుపుతుందని ఆరోపించారు.
Love Story: ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఇతర దేశాల నుంచి ఇండియాకు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే యువతి, యూపీలోని కుర్రాడి కోసం ఏకంగా సొంతదేశాన్ని వదిలి పిల్లలతో సహా ఇక్కడికి వచ్చింది. పబ్జీలో పరిచయమైన ఇద్దరు, క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇలాగే ఇండియాకు చెందిన ఓ వివాహిత, పాకిస్తాన్ అబ్బాయితో ప్రేమలో పడి అక్కడికి వెళ్లింది.
Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ దేశంపై పట్టుపెంచుకునేందుకు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఈ పరిణామం భారత్కి మింగుడుపడని అంశంగా మారింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్భంద పదవీ విరమణతో పాటు పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల్ని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ఉద్యోగులే ఇలా చేస్తే ఇది సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.