Israel-Hamas War: లెబనాన్‌పై ఒక వేళ ఇజ్రాయిల్ దాడి చేస్తే ‘‘మూర్ఖపు తప్పిదం’’ అవుతుందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం హెచ్చరించారు. మీరు లెబనాన్ పై ముందస్తు దాడి చేయాలని అనుకుంటే, అది మీ మొత్తం ఉనికిలో మీరు చేసే అత్యంత మూర్ఖపు తప్పు అవుతుందని ఉగ్రవాద సంస్థ చీఫ్ అన్నారు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 508 కోట్లు పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పేర్కొన్నారు.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఈ యుద్ధంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇరువురు నేతల భద్రత, మానవత పరిస్థితులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే అని ప్రధాని మోడీ అన్నారు.
Ayodhya Ram Mandir: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి అధికారం సాధించాలని బీజేపీ, గద్దె దించాలని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ రామమందిరంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి.
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
హర్యానాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ గిఫ్టులను అందించింది. దీపావళి కానుకగా కార్లను ఇచ్చింది. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు.
Elon Musk: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ కృత్రిమమేథపై పనిచేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో సహాయకంగా మారతుందని కొంతమంది భావిస్తుంటే, మరికొంత మంది మాత్రం మానవాళి వినాశనానికి ఇది దోహదం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
IPL: క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా స్పోర్ట్స్ లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధనిక లీగుల్లో ఒకటిగా మారింది. దీనిపై సౌదీ అరేబియా రాజు కన్ను పడింది. ఐపీఎల్లో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.
Wagner Group: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. యూరప్, అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలన్నీ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుందడగా.. అరబ్ సమాజం పాలస్తీనా వెంబడి నిలబడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దారుణ మారణహోమానికి పాల్పడ్డారు. 1400 మందిని హతమార్చారు. దీని తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. దీంట్లో 9 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.