Kangana Ranaut: ఎన్నికల పోటీలో కంగనా రనౌత్.. ఆయన ఆశీర్వదిస్తే పోరాడుతా అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
తాజాగా ఆమె వ్యాఖ్యలను చూస్తే త్వరలోనే ఎన్నికల్లో పోటీ చేస్తారనే తెలుస్తోంది. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని కంగనా రనౌత్ అన్నారు. ఈ రోజు ఆమె దేవభూమి ద్వారకలోని శ్రీకృష్ణుడి ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు ఆమెను అడిగినప్పుడు, రనౌత్, “శ్రీ కృష్ణ కీ కృపా రాహి తో లడేంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను)” అని అన్నారు.
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Read Also: Diwali Gift: బాస్ అంటే నువ్వే.. ఉద్యోగులకు దీపావళి గిఫ్టులుగా కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 600 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను సాధ్యం చేసిందని ఆమె ప్రశంసించారు. బీజేపీ కృషితోనే భారతీయులమైన శ్రీరామ ఆలయం సాకారమైందని అన్నారు. సముద్రంగర్భంలో మునిగిపోయిన ద్వారక నగరానికి చెందిన అవశేషాలను యాత్రికులు సందర్శించేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తనకు శ్రీకృష్ణుడి నగరం స్వర్గం లాంటిదని ఆమె అన్నారు.
ఇటీవల కంగనా రనౌత్ నటించిన ‘తేజస్’ మూవీ రిలీజ్ అయింది. ఇండియా తొలి స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కించారు. కంగనా దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న ‘ఎమర్జెన్సీ’, ‘తను వెడ్స్ మను 3’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!