Ayodhya Ram Mandir: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి అధికారం సాధించాలని బీజేపీ, గద్దె దించాలని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ రామమందిరంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి.
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కమల్‌నాథ్..1986లో వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంలో హిందువులు పూజలు చేసుకునేందుకు వీలుగా తాత్కాలిక రామమందిరాన్ని రాజీవ్ గాంధీ అనుమతించారని, అయోధ్యలోని రామ మందిరానికి బీజేపీ మాత్రమే క్రెడిట్ తీసుకోదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్రను విస్మరించలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి పూర్తి క్రెడిట్ దక్కేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. రామ మందిరం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని.. రామ మందిరాన్ని బీజేపీ తన ఆస్తిలా భావిస్తోందని, రామ మందిరం యావత్ దేశానికి చెందుతుందని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
Read Also: Janareddy: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మేము ప్రజలను మాత్రమే మా వెంట తీసుకెళ్తాం, ఎప్పుడూ క్రెడిట్ కోసం ప్రయత్నించలేదని, రాజీవ్ గాంధీకి కమల్ నాథ్ ఎలా క్రెడిట్ ఇస్తున్నారు..? అంటూ ఛత్తీసాగర్ కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్ షా, కమల్ నాథ్ పై విమర్శలు గుప్పించారు.
బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కూడా కమల్‌నాథ్‌ని ఎన్నికల హిందువుగా పిలిచారు. ఎన్నికల హిందువులు మధ్యప్రదేశ్ లో తిరుగుతున్నారు. కొందరు హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. మీరు హిందువు అవునా..కాదా.. అనేదే ప్రశ్న అని, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కమల్ నాథ్ ఎప్పుడైనా అయోధ్యను సందర్శించారా..? అని ప్రశ్నించారు.
కమల్‌నాథ్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తన అసలు ముఖాన్ని చూపిందని, కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్నీ ఒకటే అని ఆయన విమర్శించారు. కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యల్ని దేశం మొత్తం వింటోందని ఓవైసీ అన్నారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ మందిరం రాజకీయాల్లోకి వచ్చింది.