Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?
- భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో మాగ్నస్ కార్ల్సెన్‌కు ఓటమి
- దోహాలో జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఘటన
- ఓటమి తర్వాత టేబుల్‌పై బలంగా గుద్దుతూ కార్ల్సెన్ ఆగ్రహం వ్యక్తం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magnus Carlsen: ప్రస్తుత ప్రపంచ చెస్‌లో ‘ది వన్ అండ్ ఓన్లీ’గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాజాగా దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌పై బలంగా గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని ‘కార్ల్సెన్ అవుట్‌బర్స్ట్ 2.0’గా కామెంట్స్ చేస్తున్నారు.
New Year Liquor Sale: మద్యం ప్రియులకు పండగే.. రేపు ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలకు అనుమతి..!
Also Read
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ఇదివరకే జూన్‌లో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేష్ చేతిలో ఓడిన అనంతరం కూడా కార్ల్సెన్ తన అసహనాన్ని బహిరంగంగా చూపించాడు. ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుత ఫిడే వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఎరిగైసి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 రౌండ్లు పూర్తయ్యే సరికి 9 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమ్ వాచియర్-లాగ్రావ్‌తో కలిసి సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఎరిగైసి వరుసగా ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్‌తో పాటు, మరో స్టార్ ప్లేయర్ ఉజ్బెక్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ ను ఓడించి ముందంజలో ఉన్నారు.
కార్ల్సెన్‌పై తొమ్మిదవ రౌండ్‌లో అద్భుతమైన ఎండ్‌గేమ్ టెక్నిక్‌తో విజయం సాధించాడు. అనంతరం 10వ రౌండ్‌లో అబ్దుసత్తోరోవ్‌ను ఓడించి అగ్రస్థానంలో 0.5 పాయింట్ ఆధిక్యాన్ని సంపాదించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న కార్ల్సెన్, ఆదివారం గెలుచుకున్న వరల్డ్ రాపిడ్ టైటిల్‌తో పాటు తన తొమ్మిదవ వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఈరోజు ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో తిరిగి పోటీలోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎరిగైసి చేతిలో ఓటమి మాత్రం అతడిని తీవ్రంగా కుదిపేసింది.
Oops!…He Did It Again#RapidBlitz pic.twitter.com/O5N5CWoO2f
— International Chess Federation (@FIDE_chess) December 29, 2025
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!