Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ది జూటా సెక్యులరిజం అని దుయ్యబట్టారు.
Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే మార్గాన్ని కొనుగొనడానికి ప్రయత్నించాలని కోరింది.
Iran: ఇరాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ డ్రగ్ రిహాబ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 32 మంది మరణించారు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27 నుంచి 32కి పెరిగినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు.
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.
Elon Musk: టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన కొడుకు పేరులో ‘చంద్రశేఖర్’ అనే పేరును చేర్చారట. ఈ విషయాన్ని కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పారని మంత్రి తెలిపారు. బ్రిటన్ వేదికగా ‘గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్’లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్‌తో ఫోటో దిగారు. ఎలాన్ మస్క్ తనతో చెప్పిన విషయాలను రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.
Diabetes: ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వయసు మీద పడినవారికి మాత్రమే షుగర్ వ్యాధి వస్తుందని అనుకునే వాళ్లం, కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా 30 ఏళ్ల లోపు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారనంగా డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది.
PM Modi: ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.
Canada: కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది. 2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారుతుందని ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ…