Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్‌లైన్‌గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Google: ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్యం భయాలు టెక్ ఉద్యోగుల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసిపారేశారు. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
Bombay High Court: తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లడంపై బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. చట్టపరమైన నిషేధం లేనప్పుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని బయోలాజికల్ తండ్రి(కన్నతండ్రి)పై కేసు నమోదు చేయలేదని తీర్పు చెప్పింది. 35 ఏళ్ల వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
North Korea: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయిల్‌కి మద్దతుగా యూరప్, అమెరికా దేశాలు నిలిస్తే, పాలస్తీనాకు మద్దతుగా అరబ్ ప్రపంచం నిలబడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఒక్క హమాస్ కాకుండా లెబనాన్ నుంచి హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తన వాదనల్ని…
Uttar Pradesh: ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు, అనాలోచిత నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చాలా వరకు ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ హత్యలతో ముగుస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు, పురుషులు ఇలాంటి పనులకు పాల్పడి పచ్చని కాపురాలు విడిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలానే జరిగాయి.