Germany: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో గత 12 గంటల నుంచి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు కారుతో విమానాశ్రయంలోకరి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు, గన్ తో కాల్పులు జరపడమే కాకుండా, పెట్రోల్ బాంబులను విసిరాడు. అయితే గత 12 గంటలుగా దుండగుడితో చర్చించేందుకు హాంబర్గ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు తీసుకువచ్చిన కారులో అతనితో పాటు 4 ఏళ్ల అమ్మాయి కూడా ఉన్నారు. కారును విమానం కింద నిలిపి ఉంచాడు.…
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై గాజా హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజల్ని బందీలుగా చేసుకున్నారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ సైన్యం, గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా కుప్పకూల్చే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా మొత్తాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ చుట్టుముట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 9000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
Mumbai: ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా మాట్రిమోనల్ సైటుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకోవడమే ఎక్కువ అవుతోంది. తమ పిల్లలకు తమ స్థాయి, హోదా కలిగిన వధువు/వరుడిని వెతికేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మాట్రిమోనల్ సైట్లపై ఆధారపడుతున్నారు. తమకు తెలిసిన బంధువులు, చుట్టాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా గొప్పలకు పోతూ మాట్రిమోనీల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడా దేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు నిజ్జర్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
Madhya Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
Killing Patients With Insulin: సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లను డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తాం. కానీ అమెరికాకు చెందిన ఓ నర్సు మాత్రం మనుషుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించింది. మోతాదుకు మించి ఇన్సులిన్ ఇవ్వడం మూలంగా 17 మంది పేషెంట్ల మరణాలకు కారణమైంది. పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ప్రెస్డీ(41) ఇన్సులిన్‌తో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకుంది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.