Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన భారత్ వ్యతిరేకతను చాటుకుంటూ ఓ వీడియోలో బెదిరించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని, ప్రయాణిస్తే వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతాయంటూ బెదిరించాడు.
Kilonova Space Explosion: బ్రహ్మాండమైన విశ్వంలో శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది కేవలం ఒక్క శాతం కూడా ఉండకపోవచ్చు. అనేక వింతలు, విశేషాలకు ఈ విశ్వం కేంద్రంగా ఉంది. అయితే మనకు తెలిసింత వరకు ఇప్పటివరకు ఒక్క భూమిపైనే జీవం ఉంది. అయితే అనంత విశ్వంలో మనలాంటి జీవులు, మనలాంటి భూములు కొన్ని కోట్లలో ఉండొచ్చు, కానీ మనం చూడలేం.
శనివారం రోజున రాహుల్ తన ఇంటిలో బెడ్రూంలో ఉరివేసుకుని ఉండటాన్ని అతని తల్లిదండ్రులు, స్నేహితులు గమనించారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది తమకు సమాచారం ఇచ్చిందని వారు వెల్లడించారు.
Diwali Surprise: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రతీ కంపెనీ కూడా తన ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్టులు, స్వీట్లు అందచేస్తు్న్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరిచిపోలేని కానుకలను ఇస్తోంది. కార్లు, బైకులను అందించి సర్ప్రైజ్ చేస్తున్నాయి. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీల తన ఉద్యోగులకు కార్లను అందించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.
Humaira Himu: బంగ్లాదేశ్‌లో ప్రముఖ నటి హుమైరా హిము(37) మరణించారు. మంగళవారం ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి హుమైరా ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే రాజధాని ఢాకాలోని ఉత్తరా మోడ్రన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Himanta Biswa Sarma: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ‘‘మియా ముస్లింల’’ ఓట్లను ఆశించడం లేదని శనివారం అన్నారు. గౌహతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మియా ముస్లింలు ఎక్కువగా ఉన్నందున తాను మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’లో ఇరుకున్నారు. యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్‌కి రూ. 508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయం ప్రాముఖ్యతను పెంచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ని ఉటంకిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అక్రమ డబ్బును తరలిస్తున్న కొరియర్ని ఈడీ పట్టుకోవడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏజెన్సీ పేర్కొంది.
Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుందని అంతా అనుకునే వాళ్లం. కానీ ఇప్పడు స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపువారు కూడా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. అంతవరకు సంతోషంగా పెళ్లిలోనో, ఇతర శుభకార్యాల్లో నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్న వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా విగతజీవులవుతున్నారు.
INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.