China vs Battle of Galwan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్యాటిల్ ఆఫ్ గల్వాన్” సినిమాపై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌పై గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పలు ఆరోపణలు చేసింది. చైనా పత్రికలు ఈ సినిమాను సైద్ధాంతిక విషం నింపుతున్న జాతీయవాద మెలోడ్రామాగా పేర్కొంది. డ్రాగన్ కంట్రీ ప్రకారం, సినిమా కథనం 2020లో గల్వాన్ లో జరిగిన సంఘటనలను దృష్టితో కాకుండా, భారత బలగాలే చైనా భూభాగంలోకి చొరబడ్డారని, చర్చల సమయంలో హింసాత్మక దాడులు చేసినట్టు బీజింగ్ ఆరోపణలు చేస్తుంది.
Read Also: Santhana Prapthirasthu : ఓటీటీలో దూసుకుపోతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’..
అయితే, భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని బీజింగ్ వార్త సంస్థలు ఆరోపిస్తున్నాయి. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని సెటైర్లు వేసింది. అలాగే, ఈ చిత్రానికి చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు అన్నారు. అందువల్ల చైనా పత్రికల్లో గల్వాన్ సినిమాపై అక్కడి మీడియా విష ప్రచారం చేయడం కామన్ అన్నారు.
Read Also: Suicidal Thoughts: ఈ నెలలోనే ‘సూసైడ్ థాట్స్’ ఎక్కువగా వస్తాయంటా!
ఇక, భారత ప్రేక్షకుల దృష్టిలో “గల్వాన్” సినిమా ఒక దేశభక్తితో కూడిన యుద్ధచిత్రంగా నిలిచింది. ఇందులో భారత సైనిక దళాల ధైర్యం, ఆర్మీ ధైర్యం ప్రజలను ఆకట్టుకుంటోందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.