Halal: ఉత్తర్ ప్రదేశ్ లో యోగి సర్కార్ నకిలీగాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ హలాల్ ధృవపత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను విక్రయించే అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. హలాల్ సర్టిఫికేట్ ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉత్పత్తులు తయారుచేయబడ్డాయని, కల్తీ లేదని సూచించిస్తుంది.
Amazon Layoff: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల నుంచి వందలాది మందికి లేఆఫ్ ప్రకటించింది. ఈ సారి అలెక్సా విభాగం నుంచి వందలాది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సంస్థ దృష్టి పెట్టడంతో ఈ తొలగింపులను చేపట్టింది. గతేడాది నుంచి ప్రముఖ టెక్ కంపెనీలు ఇలా వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Mohammed Shami:వరల్డ్ కప్ టోర్నీలో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. టోర్నమెంట్లో ఆరు మ్యాచులు ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం షమీ వరల్డ్ కప్ తో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తప్పుకోవడంతో షమీకి ఛాన్స్ లభించింది. వచ్చీ రావడంతోనే షమీ సత్తా…
Jaya Prada: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు ఉత్తర్ ప్రదేశ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు మాజీ ఎంపీ జయప్రదపై యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్-బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.
World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా, క్రికెట్ ఇష్టమున్న ప్రతీ ఒక్కరు ఈ హై ఓల్టెజ్ మ్యాచు కోసం చూస్తు్న్నారు. రోహిత్ సేన సగర్వంగా వరల్డ్ కప్ నెగ్గాలని సగటు ఇండియన్ అభిమాని కోరుకుంటుతోంది. ఈ మ్యాచు కోసం అతిథులు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియానికి హాజరుకాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియా డిఫ్యూటీ పీఎం రిచర్డ్…
Kerala Nurse: దేశం కాని దేశంలో కేరళకు చెందిన నర్సుకు మరణశిక్ష పడింది. యెమెన్ దేశంలో అక్కడి పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో భారత్‌కి చెందిన నిమిషా ప్రియకు మరణశిక్ష విధించబడింది. అయితే తాజాగా మరణశిక్ష అప్పీల్‌ని అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మరణశిక్ష ఖాయంగా కనిపిస్తోంది. ప్రియా తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో దోషిగా నిర్థారించడంతో మరణశిక్ష విధించబడింది. చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థనను కూడా అక్కడి యెమెన్ న్యాయస్థానం తిరస్కరించింది.
Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లను హర్యానా రాష్ట్రంలోని…
Rohingya refugees: మయన్మార్‌లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునేలోపే అలసటతో కుప్పకూలారు.…
World Cup Final: వరల్డ్ కప్ అంతిమ సమరం ఆదివారం జరగబోతోంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ గెలవాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ ఫైనల్ జరగబోతోంది. దేశం మొత్తం కూడా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది.
Buy a car on Amazon: ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.