BJP: 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కేంద్రంమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్(APEC)లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లారు. అయినా కూడా స్వదేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Karnataka: కర్ణాటకలోని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం స్పీకర్ యూటీ ఖాదర్‌ను గౌరవంగా పలకరించేలా చేశామని, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఆయన్ను గౌరవంగా పలకరించడం తప్పదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘటత అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘ ఈరోజు బీజేపీ లేచి నిలబడి మా యూటీ ఖాదర్‌కి ‘నమస్కారం సార్’ అని…
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1400 మందిని హతమర్చాడమే కాకుండా, ఇజ్రాయిల్ లోని 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి బందీలుగా పట్టుకెళ్లింది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందిని చంపేసినట్లు తెలుస్తోంది. తాజాగా 19 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళా సైనికురాలు హత్యకు గురైనట్లు డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Deepfakes: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదం అయింది. అసభ్యకరంగా ఉన్న ఈ వీడియోలపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని శుక్రవారం అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్‌ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని…
lottery: గల్ఫ్ కంట్రీస్‌లో నివసిస్తున్న భారతీయలపై లాటరీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఏఈ లాటరీ డ్రాల్లో భారతీయులు గెలుపొందుతున్నారు. యూఏఈలో నివసిస్తున్న కనీసం ఐదుగురు భారతీయులు వారానికి లాటరీ లేదా వీక్లీ డ్రాల్లో గెలుపొందుతున్నారు. వీరిలో ఎక్కువగా పనిచేయడానికి అక్కడికి వెళ్లిన వారినే ధనలక్ష్మీ వరిస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఈ లాటరీలను గెలుచుకుంటున్నారు.
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Israel: గాజాలోని ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను ప్రపంచం ముందుంచింది. ముఖ్యంగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి హమాస్‌కి ప్రధాన కేంద్రంగా ఉందని, ఈ ఆస్పత్రి కింద హమాస్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ గుర్తించింది. ఈ ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
Lizard in Samosa: ఇటీవల కాలంలో బయటి ఆహారంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పుడ్ ఫాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చికెన్ షవర్మా వల్ల ఒకరిద్దరి ప్రాణాలు పోయాయి. రెస్టారెంట్ల, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల నిఘా లేకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. ఆహారంలో బల్లులు, కీలకాలు, ఎలుకలు రావడం పరిపాటిగా మారింది. సామాన్య జనాల ప్రాణాలతో ఫుడ్ మాఫియా ఆటలాడుకుంటోంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి పలు కార్ల కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కార్లు కొనేవారే కరువయ్యారు. సప్లై చైన్‌లో అంతరాలు, తక్కువ డిమాండ్ వల్ల ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.