Buy a car on Amazon: అమెజాన్‌లో కారు కొనుగోలు చేయాలా.? త్వరలో వాస్తవం కాబోతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy a car on Amazon: ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.
అమెజాన్‌లో కారు కొనాలా..? అయితే ఇది కొన్ని రోజుల్లో వాస్తవం కాబోతోంది. అమెజాన్ ఆటోమోటివ్ రంగంలోకి అడుగుపెట్టింది. వర్చువల్ షోరూం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్లను ధరలు, ఫీచర్లను పోల్చి చూసేలా కస్టమర్లకు సేవలు అందించబోతోంది. దీని కోసం హ్యుందాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు వినియోగదారులు వెబ్‌సైట్ ద్వారా కారు భాగాలు, ఇతర ఉపకరణాలు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ తీసుకున్న ఈ స్టెప్ కార్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది, డీలర్‌షిప్ విజిబిలిటీని మెరుగుపరుస్తుంది.
Also Read
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
Read Also: Aadikeshava: మమ్మల్ని క్షమించండి.. సరైన సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం
దీనికి ముందు అమెజాన్ యూజర్లు కార్ల కోసం ధరలను పోల్చి చూసే సదుపాయాన్ని కొన్ని దేశాల్లో అందించింది. అయితే వచ్చే ఏడాది నుంచి హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల ద్వారా అమెజాన్‌లో అమ్మకానికి కార్ మోడళ్లను లిస్ట్ చేయనుంది. కస్టమర్లు సైట్ ద్వారా వివిధ కార్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వారి పేమెంట్ పద్ధతుల ద్వారా కారును కొనుగోలు చేసి సమీపం డీలర్ వద్దను నుంచి కార్ తీసుకోవచ్చు. లేదంటే నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేసుకోవచ్చు.
అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేతగా సదరు కార్ కంపెనీ డీలర్ ఉంటారు. డీలర్ షిప్‌ని కనెక్ట్ చేసే మధ్యవర్తిగా అమెజాన్ పనిచేస్తుంది. అయితే ఇతర కార్ కంపెనీలు, అమెజాన్‌తో జట్టుకడుతాయో లేదో చూడాలి. అమెజాన్ ద్వారా డీలర్లను దగ్గర చేయడంతో పాటు, వినియోగదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ మేరకు హ్యుందాయ్‌తో అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికే టెస్లా తన వెబ్‌సైట్ ద్వారా కార్లు కొనుగోలు చేసేలా డైరెక్ట్ టూ కన్సూమర్ ఆప్రోచ్ విధానాన్ని తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!