Amazon Layoff: అమెజాన్‌లో వందలాది ఉద్యోగుల తొలగింపు.. ఈ సారి అలెక్సా వంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Layoff: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల నుంచి వందలాది మందికి లేఆఫ్ ప్రకటించింది. ఈ సారి అలెక్సా విభాగం నుంచి వందలాది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సంస్థ దృష్టి పెట్టడంతో ఈ తొలగింపులను చేపట్టింది. గతేడాది నుంచి ప్రముఖ టెక్ కంపెనీలు ఇలా వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తొలగింపులపై అలెక్సా, ఫైర్ టీవ విభాగాల వైస్ ప్రెసిడెంట్ డేనియన్ రౌశ్ ఈ మేరకు ఉద్యోగులకు లేఖ రాశారు. మారుతున్న వ్యాపార ప్రాధాన్యతల్లో భాగంగా మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నంలో కొన్నింటిలో మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉత్పాదకత పెంచడం, ఏఐపై ఫోకస్ పెట్టడం వంటివి ఉన్నాయని వెల్లడించారు. అయితే ఎంత మంది తాజా లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
Read Also: Pass Word: ఏందిరా అయ్యా..! ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది ఇదే పాస్ వర్డ్ వాడుతున్నారా..!
గత కొన్ని రోజులుగా అమెజాన్ వివిధ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తోంది. ఇటీవల తన గేమింగ్ డివిజన్ నుంచి 180 మందిని తొలగించింది. అంతకుముందు వారం స్ట్రీమింగ్ మ్యూజిక్, పోడ్ కాస్ట్ విభాగంలో ఉద్యోగులను తీసేసింది. ఈ త్రైమాసికంలో అమెజాన్ మంచి వృద్ధిరేటు కనబరిచినా కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడం గమనార్హం.
ఆర్థికమాంద్య భయాలు, ఆర్థిక మందగమనం కారణాల వల్ల గతేడాది నవంబర్ నుంచి పలు టెక్ దిగ్గజాలు అనేక మందిని తొలగిస్తోంది. అమెజాన్ ఏకంగా 18,000 మందిని తొలగించింది. ఆ తర్వాత కూడా ఉద్యోగులను పలు దశల్లో తొలగిస్తూ వస్తోంది. టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేశాయి.
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!