Covid-19: కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు కోవిడ్ మహమ్మారి ఎంట్రీ..
- సరిగ్గా ఆరేళ్ల క్రితం కోవిడ్-19 ఎంట్రీ..
- చైనా వూహాన్ నగరంలో మొదటగా కేసులు..
- 2020 మార్చి నాటికి ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
కరోనాకు కేంద్రంగా వూహాన్:
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఈ మొత్తం కరోనాకు చైనాలోని వూహాన్ నగరం కేంద్రంగా మారింది. చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, లక్షణాల తీవ్రంగా ఉండటంతో అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇది నెమ్మదిగా చైనా నుంచి ప్రపంచంలోని మిగతా దేశాలకు వ్యాప్తించింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని, ఆరోగ్య వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది.
వూహాన్‌లోని ఫిష్ మార్కెట్‌లో మొదటగా ఈ కోవిడ్-19 కేసుల్ని గుర్తించారు. ఇది మహాసముద్రాలు దాటి యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని ఇతర దేశాలకు చేరింది. 21వ శతాబ్దపు అత్యంత వినాశకరమైన మహమ్మారిగా మారింది. మార్చి 2020 నాటికి, వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను అరికట్టడానికి దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. నగరాలను స్మశానాలను తలపించేలా ‘‘లాక్‌డౌన్’’ పరిస్థితిలోకి వెళ్లాయి. అధికారికంగా కోవిడ్-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ల మంది ప్రాణాలు వదిలారు. మహా మాంద్యంత తర్వాత ఎప్పుడూ చూడని విధంగా పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కుచించుకుపోయాయి.
భారత్‌లో లాక్‌డౌన్:
కోవిడ్-19ను అరికట్టడానికి భారత్ మార్చి 2020లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ముందుగానే వినాశనాన్ని గుర్తించిన కేంద్రం.. ఆస్పత్రులు, పరీక్షలు, ఆక్సిజన్ సరఫరా సప్లై చైన్‌ను బలోపేతం చేయడానికి సమయాన్ని సంపాదించుకుంది. కానీ, కోవిడ్-19 డెల్టా వేరియంట్ వారాల్లోనే లక్షలాది మందిని చంపింది. అయినప్పటికీ, భారత్ ఒక ఏడాది లోపే వ్యాక్సిన్‌ను తయారు చేసుకోగలిగింది.
భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌ను భారీగా ఉత్పత్తి చేసింది. లక్షలాది మంది మరణాలను అడ్డుకునేందుకు సహాయపడ్డాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరేళ్ల క్రితం వూహాన్ నుంచి వచ్చిన ఈ కరోనా వైరస్, ప్రపంచ దేశాలకు ఆరోగ్య అత్యవసర స్థితికి ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పించింది.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!