Putin: రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్‌తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. వన్డేల్లో 50వ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచుని దేశం మొత్తం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయారు.
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Husband Kills Wife: టర్కీలో దారుణం జరిగింది. విహారయాత్రకు తీసుకువచ్చి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫాతిహ్లోని ఒక హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడిని బ్రిటన్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తన భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు టర్కీకి వచ్చాడు.
Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్‌లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21 ఏళ్ల తరువాత ఒసామా బిన్ లాడెన్‌ని…
Germany: ఇటీవల కాలంలో యూరప్ లోని పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం చాపకింద నీరులా పెరుగుతోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యం యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో హింసకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో ఇలాంటి ప్రో పాలస్తీనా నిరసనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఇది తుఫానుగా మారిన తర్వాత ‘మిధిలీ’గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పేరున మాల్దీవులు సూచించింది. మిధిలీ తుఫాన్ శనివారం ఉదయం బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, మోంగ్లా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది.
Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు వ్యవహారం కూడా సుప్రీం ముందుకు వచ్చింది.