World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా, క్రికెట్ ఇష్టమున్న ప్రతీ ఒక్కరు ఈ హై ఓల్టెజ్ మ్యాచు కోసం చూస్తు్న్నారు. రోహిత్ సేన సగర్వంగా వరల్డ్ కప్ నెగ్గాలని సగటు ఇండియన్ అభిమాని కోరుకుంటుతోంది. ఈ మ్యాచు కోసం అతిథులు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియానికి హాజరుకాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియా డిఫ్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ హాజరుకానున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచు కోసం భారత మిత్రదేశమైన ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ స్పందించారు. భారత్‌కి తన మద్దతు తెలియజేశారు. మరోవైపు ఆయన శుక్రవారం క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకపోటీ ప్రకటించారు. ఫ్యాన్స్ ఇండియా-ఇజ్రాయిల్ బంధాన్ని చూపించే విధంగా జెర్సీ డిజైన్లను ఇజ్రాయిల్ ఎంబసీలతో పంచుకోవాలని, గెలిచిన వారికి 15 మంది ఇండియన్ ప్లేయర్లను, ఇండియన్ టీంని రిప్రజెంట్ చేసేలా స్పెషల్ జెర్సీలను గెలుపొందిన 15 మందికి ఇస్తానని నూర్ గిలోన్ ఓ వీడియోలో చెప్పారు.
Read Also: Kerala Nurse: నర్సు నిమిష ప్రియ కథ.. దేశం కానీ దేశంలో మరణశిక్ష.. అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..
“షాలోమ్ ఇండియా! రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ గురించి రాయబార కార్యాలయంలో మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము మరియు వాస్తవానికి, మేము భారతదేశం కోసం మద్దతు ఇస్తున్నాం. ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య బంధాన్ని ప్రదర్శించే 15 మందికి జెర్సీలను నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను” అంటూ ఎక్స్(ట్విట్టర్)లో నూర్ గిలోన్ పోస్ట్ చేశారు. జెర్సీ డిజైన్లతో ఆకట్టుకున్న క్రియేటివిటీ ఉన్న కళాకారులకు 15 జెర్సీలు పంపిస్తానని నేను హామీ ఇస్తున్నా అంటూ క్రికెట్ ఉత్సవాన్ని ప్రారంభిద్దాం.. “చక్ దే ఇండియా” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
2003 ప్రపంచ కప్ తర్వాత 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో తలపడుతున్నాయి. ఈసారి ఆస్ట్రేలియాను మట్టికరిపించాలనే లక్ష్యంతో ఇండియా ఉంది. ఈ మ్యాచుకి ప్రధానితో పాటు పలువురు వీవీఐపీలు, సెలబ్రెటీలు హాజరుకాబోతున్నారు.
The #CWC23 Finals – #INDvsAUS is here and we're all in for #TeamIndia! 🏏
Show us your creative spin on the jersey showcasing the bond between #Israel & #India, and you could be one of the lucky 15 winners!
Make sure to use #JerseyArt & tag @israelinindia
चक दे 🇮🇳@BCCI pic.twitter.com/UCaNh9GETh
— Naor Gilon (@NaorGilon) November 17, 2023