Halal: ఉత్తర్ ప్రదేశ్ లో యోగి సర్కార్ నకిలీగాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ హలాల్ ధృవపత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను విక్రయించే అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. హలాల్ సర్టిఫికేట్ ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉత్పత్తులు తయారుచేయబడ్డాయని, కల్తీ లేదని సూచించిస్తుంది.
Read Also: Amazon Layoff: అమెజాన్‌లో వందలాది ఉద్యోగుల తొలగింపు.. ఈ సారి అలెక్సా వంతు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యాపారులు నకిలీ పత్రాల ద్వారా తమ ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ పొందారని.. ఇందులో చెన్నైకి చెందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉందని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ పేర్కొంది. ‘నకిలీ’ హలాల్ ధృవీకరణ పత్రాలు సౌందర్య సాధనాలు, టూత్‌పేస్టులు, నూనె మరియు సబ్బుల నుండి వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించడానికి ఉపయోగించబడుతున్నాయి. ఢిల్లీలోని జమియత్ ఉలేమా హింద్ హలాల్ ట్రస్ట్, హలాలా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ముంబైకి చెందిన జమియత్ ఉలేమా వంటి అనేక సంఘాల పేర్లను పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.కొన్ని కంపెనీలు నిర్ధిష్ట కమ్యూనిటీకి చెందిన వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు నకిలీ హలాల్ సర్టిఫికేట్లు ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.