Electricity bill: ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలతో కొందరి కోట్ల రూపాయల బిల్లులు రావడం చూస్తు్న్నాం. తర్వాత విద్యుత్ అధికారులు తమ తప్పులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు రూ.4950 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఏకంగా రూ. 197 కోట్ల చెల్లింపు రసీదును ఇచ్చింది. బిల్లులను టాలీ చేసుకునేప్పుడు, లెక్కలు చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. లక్నోలోని సీనియర్ విద్యుత్ అధికారులు కూడా ఈ బిల్లు…
UP man marries Dutch girlfriend: ఇటీవల కాలంలో ఇండియన్ అబ్బాయిలు ఫారిన్ అమ్మాయిలను లవ్‌లో పడేస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో పరిచయాలతో తన లవర్ని కలుసుకునేందుకు ఏకంగా ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న ఇండియా అబ్బాయిలు, యూరప్, అమెరికా అమ్మాయిలకు నచ్చుతున్నారు. ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లిళ్లకు దారి తీస్తున్నాయి.
skydiver: ఆకాశంలో నుంచి దూకడం చాలా మంది స్కైడైవర్లకు థ్రిల్ ఫీల్‌ని ఇస్తుంది. మరికొంత మంది ఈ థ్రిల్‌ని ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా సుశిక్షితులైన ఇన్‌స్ట్రక్టర్ల సాయంతో ఆకాశం నుంచి దూకుతుంటారు. పారాష్యూట్లో లాండ్ కావడం వారికి సరదాగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పారాష్యూట్ ఫెయిల్ అయి వేల అడుగుల ఎత్తు నుంచి భూమిపై పడిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా పడిపోయిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
Serial killer: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సీరియల్ కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బరేలీలో ఆరు నెలల వ్యవధిలో 9 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. ఒంటరి మహిళలే టార్గెట్ అవుతుండటంతో మహిళలు ఎవరూ కూడా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు.
White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ‘వైట్ లంగ్ సిండ్రోమ్’ అని పిలువబడుతున్న బ్యాక్టీరియా, న్యూమోనియా కొత్త వ్యాప్తిగా చెప్పబడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి చైనాతో పాటు డెన్మా్ర్క్, అమెరికా, నెదర్లాండ్స్‌లోని పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మూడు నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తోంది.
Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
Pakadwa Vivah: పురాతన కాలంలో రాక్షస వివాహం, గంధర్వ వివాహం అనేవి చూశాం. రాక్షస వివాహంలో బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి వివాహాలు ఇప్పటికే బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. తమ కూతుళ్లు వివాహం చేసే స్థోమత లేకపోవడం, బాగా సెటిల్ అయిన వ్యక్తిని చూసి అతడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. బీహార్ ప్రాంతంలో ఇలాంటి పెళ్లిళ్లను ‘పకడ్వా వివాహం’గా పిలుస్తుంటారు.
Rapido: బెంగళూర్‌లో దారుణం జరిగింది ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. రాపిడో ఆటో డ్రైవర్ సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ స్నేహితుడు అంకుర్ బాగ్చి బుధవారం ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. తన స్నేహితురాలిని రాపిడో ఆటో డ్రైవర్ అనుచితంగా తాకడమే కాకుండా ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న వాహనం నునంచి బలవంతంగా బయటకు తోసేశాడని వెల్లడించారు.
Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.