Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. ఆటో నుంచి తోసేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapido: బెంగళూర్‌లో దారుణం జరిగింది ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. రాపిడో ఆటో డ్రైవర్ సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ స్నేహితుడు అంకుర్ బాగ్చి బుధవారం ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. తన స్నేహితురాలిని రాపిడో ఆటో డ్రైవర్ అనుచితంగా తాకడమే కాకుండా ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న వాహనం నునంచి బలవంతంగా బయటకు తోసేశాడని వెల్లడించారు. లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. సదరు సంస్థ సేవలు ఉపయోగించుకోవద్దని ఇతరులను కోరారు. ‘‘రాపిడో లైంగిక వేటగాళ్లను తీసుకుంటుందని, దాన్ని ఉపయోగించవద్దని, నా స్నేహితుల్లో ఒకరు గత రాత్రి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమెను అనుచితంగా తాకాడు. కదుతున్న ఆటో నుంచి నెట్టేశాడు’’ అని గురువారం నాడు రాశారు.
Read Also: Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..
Also Read
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
Rapido enables sexual predators. Do not use Rapido.
One of my friends got sexually assaulted last night by a @rapidobikeapp auto driver. She was touched inappropriately and when she pushed back, she was thrown out of a moving auto.
She reached out to Rapido to resolve this and…
— Ankur Bagchi (@JustAnkurBagchi) November 30, 2023
Please provide specific area details of the incident and your contact number via DM.
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) November 30, 2023
అయితే ఈ కేసులో రాపిడోకు ఫిర్యాదు చేస్తే కేవలం క్షమాపనలు చెప్పింది, కానీ ఆటో రిక్షా డ్రైవర్ గురించి ఎలాంటి వివరాలు అందించలేదని అతను వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య సహాయం అవసరమని అంకర్ బాగ్చీ పోస్ట్ చేశారు. ఆయన పోస్టుపై బెంగళూర్ సిటీ పోలీసులతో సహా, నెటిజన్లు స్పందించారు. ‘‘ఈ ఘటన గురించి వివరాలను, ఆ ప్రాంతం వివరాలను, మీ కాంటాక్ట్ నెంబర్‌ని డీఎం ద్వారా వెల్లడించండి’’ అని పోలీసులు ట్వీట్ చేశారు. మరొక పోస్టులో డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై కస్టమర్‌తో చర్చించినట్లు, రాపిడో డ్రైవర్‌ని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తున్నట్లు రాపిడో కేర్స్ పోస్ట్ చేసింది. అతడిని రాపిడో నుంచి తొలగించామని వెల్లడించింది. మరోసారి రాపిడో క్షమాపనలు చెప్పింది.
@JustAnkurBagchi As discussed with the customer, Rapido is getting the captain to the HAL police station at 4:30pm to proceed legally on this.
— Rapido Cares (@RapidoCares) November 30, 2023
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!