COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్‌లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
జనాభా తక్కువగా ఉన్న చాలా దేశాలతో పోలిస్తే, ఇండియాలో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచ జనాభాలో భారత్‌లో 17 శాతం ఉంటే.. కర్బన్ ఉద్గారాల్లో 4 శాతం మాత్రమే ఉందని, ఎన్డీసీ లక్ష్యాలను సాధించడంలో మేము వేగవంతంగా పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. మా నాన్-ఫాజిల్ ప్యూయల్ లక్ష్యాలను డెడ్‌లైన్ కన్నా తొమ్మిదేళ్ల ముందే చేరుకున్నామన్నారు. 2070 నాటికి శిలాజేతర ఇంధన లక్ష్యాలను భారత్ నెట్ జిరోకి చేరుతుందని ఆయన వెల్లడించారు. గత శతాబ్ధపు తప్పులను సరిదిద్దడానికి మనకు ఎక్కువ సమయం లేదని, ప్రతీ దేశం కూడా నేషనల్లీ డిటర్మైంట్ కాంట్రిబ్యూషన్(NDC) లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
Read Also: Serial killer: 6 నెలల్లో 9 మంది మహిళల హత్య.. సీరియల్ కిల్లర్ కోసం గాలింపు..
భారతదేశం ప్రపంచానికి అభివృద్ధి నమూనాను అందించిందని, ఎకాలజీ-ఎకనామి మధ్య సమతుల్యతను కలిగి ఉందని అన్నారు. 2030 నాటికి ఉద్గార తీవ్రతను 45% తగ్గించి, శిలాజ యేతర ఇంధనాల వాటాను 50%కి పెంచాలని భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుందని, హైడ్రోజన్ ఫ్యూయల్, బయో ఫ్యూయల్ పొత్తుల ద్వారా భారత్ ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ముందుకు వచ్చిందని తెలిపారు. మనం మాత్రమే ప్రయోజనం పొందాలనే దృక్ఫథం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తుందని, అన్ని దేశాలు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. 2028లో COP28 సదస్సు ఇండియాలో జరగనుంది.