Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.
Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.
Food poisoning: ఇటీవల కాలం పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. సంగ్రూర్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్యాంటీన్లో ఆహారం తిని 60 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు శనివారం తెలిపారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా ఉన్న జపొరిజ్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. యూరప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్ కర్మాగారం ఇక్కడే ఉంది. ఇదిలా ఉంటే జపొరిజ్జియా అణు కర్మాగారాన్ని, ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్‌కి అనుసంధానించే రెండు విద్యుత్ లైన్లను రాత్రిపూట కట్ చేశారు.
Supreme Court: సాధారణంగా పురుషులే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే మహిళపై అత్యాచార కేసు పెట్టవచ్చా..? అనేది ప్రశ్న. అయితే దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ అత్యాచార కేసులో ఒక మహిళ పిటిషన్ వేయడంతో దీన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 61 ఏళ్ల మహిళపై ఆమె కోడలు పెట్టిన కేసులో స్పందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం సిద్ధమైంది.
Maruti Suzuki Jimny: ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో మహీంద్రా థార్ తన సత్తాను చాటుకుంది. అయితే థార్‌కి పోటీగా మారుతి సుజుకి జమ్నీతో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. థార్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా జిమ్నిని తీర్చిదిద్దింది. 5-డోర్ వాహనంగా జిమ్ని రావడం చాలా మందిని ఆకర్షింది. ఆఫ్-రోడర్‌గా, ఫ్యామిలీ కార్గా వినియోగించుకునేందు జిమ్ని మంచి ఆఫ్షన్‌గా మారింది. దీంతో పాటు సగటు ఇండియన్ కోరుకునే మైలేజ్ విషయంలో కూడా జమ్నిని మారుతి సుజుకీ తీర్చిదిద్దింది.
Elon Musk: ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్ 1 బిలియనీర్. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరాలింక్ ఇలా టెక్ మొగల్‌గా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే తన బాల్యం అనుకున్నంత సంతోషంగా ఏం లేదని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది మేలో ఒక ట్వీట్లో తన బాల్యంలో అనుభవించిన బాధల్ని పంచుకున్నారు. 1989కి ముందు తాను సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివసించేవాడినని వెల్లడించారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో జరిగిన…
Kim Jong Un: ఉత్తర కొరియా ఇటీవల తన మొదటి సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. దీనికి ముందు రెండుసార్లు ఇలాగే ప్రయోగాలు చేయగా.. విఫలమైంది. అయితే ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తప్పపట్టింది. అయితే కిమ్ పంపిన ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆ దేశ అంతరిక్ష అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు.