Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికన్ పౌరుడైన పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు ప్రయత్నించారనే విషయాన్ని అక్కడి బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని చెక్ రిపబ్లిక్ దేశంలో అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిఖిల్ గుప్తాకు, భారత ప్రభుత్వ ఉద్యోగి సహకరించాడని యూఎస్ న్యాయశాఖ అభియోగపత్రాలు పేర్కొన్నాయి. ఆ భారత ఉద్యోగిని cc1 అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇతనే గుప్తాకు డైరెక్షన్స్ ఇచ్చాడని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Putin: 8 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు పుతిన్ పిలుపు..
ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన గూఢచారి సంస్థ సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌ని భారత్‌కి పంపినట్లు రాయిటర్స్ నివేదించింది. పన్నూ హత్యలో భారత ప్రమేయం ఉందని వస్తున్న నేపథ్యం ఆయన భారతదేశంలోని అత్యున్నత స్థాయిలో చర్చించడానికి, విచారణ కోసం భారత్ వస్తున్నట్లు తెలుస్తోంది.
సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఈ ఏడాది ఆగస్టులో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) చీఫ్ రవి సిన్హాతో భేటీ అయి.. భారతదేశం దర్యాప్తు చేసి బాధ్యులు జవాబుదారీగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరగకూడదని హమీ ఇవ్వాలని కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. జూలై 2023 చివర్లోనే ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. దీనిపై భారత్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీ20 సదస్సులో ప్రధాని మోడీతో జోబైడెన్ సమావేశం జరిగిన సమయంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?