skydiver: ఆకాశంలో నుంచి దూకడం చాలా మంది స్కైడైవర్లకు థ్రిల్ ఫీల్‌ని ఇస్తుంది. మరికొంత మంది ఈ థ్రిల్‌ని ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా సుశిక్షితులైన ఇన్‌స్ట్రక్టర్ల సాయంతో ఆకాశం నుంచి దూకుతుంటారు. పారాష్యూట్‌లో లాండ్ కావడం వారికి సరదాగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పారాష్యూట్ ఫెయిల్ అయి వేల అడుగుల ఎత్తు నుంచి భూమిపై పడిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా పడిపోయిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
14,000 అడుగుల ఎత్తు అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి పారాష్యూట్ ఫెయిల్ కింద పడినా కూడా ఓ మహిళ అనూహ్యంగా బతికింది. అంతటి ప్రమాదకరమైన ఘటనను ఆమె వెల్లడించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎమ్మా కేరీ అనే యువతి 2013లో స్విట్జర్లాండ్ టూర్ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఎలాంటి బాధను అనుభవించాననే వివరాలను ఓ మీడియా ఏజెన్సీకి చెప్పింది.
కారీకి, ఆమె ఫ్రెండ్ జెమ్మా మ్రడాక్ స్కై డైవింగ్ అంటే భయం, కానీ అందులో ఉండే థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు స్కైడైవింగ్ చేయాలని కారీ అనుకుంది. 20 ఏళ్ల వయసులో కారీ ఆకాశం నుంచి దూసుకు వస్తూ నేలపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని అనుకుంది. అయితే ఆమె ఊహించని విధంగా ప్రమాదంతో ముగిసింది. తన పారాష్యూట్ ఫెయిల్ కావడంతో, భూమిపై పడి చనిపోతానని అనుకుంది, కానీ ఆ తర్వాత నరకం లాంటి నొప్పిని అనుభవించిన సంగతులను పంచుకుంది. ఈ భయంకరమైన అనుభవాన్ని పంచుకున్న వీడియోకు 1.5 మిలియన్ల వ్యూ్స్ వచ్చాయి.
‘‘ముందుగా మేము హెలికాప్టర్‌లో ఆకాశంలోకి వెళ్లి, 14,000 అడుగుల నుంచి దూకాము. నాతో పాటు నా ఇన్‌స్ట్రక్టర్ కూడా ఉన్నారు. అప్పుడే అతను నా చేతులు చాచమని అడిగాడు. అప్పుడు అతను పారాష్యూట్ లాగాలని అనుకున్నాడు. అయితే అది జరగలేదు. అతను చేయగలిగింతా చేస్తున్నాడని అనుకున్నాను. కానీ మా ముందు పారాష్యూట్ చూడటంతో అసలు విషయం అర్థమైంది’’ అని కారీ పోడ్‌క్యాస్ట్‌లో చెప్పారు.
Read Also: Serial killer: 6 నెలల్లో 9 మంది మహిళల హత్య.. సీరియల్ కిల్లర్ కోసం గాలింపు..
నేలను తాకినప్పుడు తాను స్పృహలోనే ఉన్నానని, తాను స్వర్గంలో ఉన్నానని భావించానని, అయితే తాను అనుభిస్తున్న నొప్పి మాత్రం నరకంగా ఉందని ఆమె చెప్పారు. పారాష్యూట్ తన ఇన్‌స్ట్రక్టర్ గొంతును కోశాయని, అతను స్పృహ కోల్పోయాడని, అతను నా కేకలకు స్పందించలేదని వెల్లడించింది.
నా ఫ్రెండ్ జెమ్మా నేలపై పడిపోవడాన్ని గమనించిందని, ఆ సమయంలో నేను నా కుటుంబం గురించి ఆలోచించానని చెప్పారు. కిందపడే సమయంలో కారీ తన ఇన్‌స్ట్రక్టర్ ముఖాముఖిగా నెలపై పడ్డారు. అయితే ఆ సమయంలో కారీ అతడిని పక్కకు జరిపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది, అప్పుడే తన నడుము పూర్తిగా పక్షవాతానికి గురైందని తెలిసిందని చెప్పింది.
ఈ ప్రమాదంలో కారీ వెన్నెముక రెండు చోట్ల విరిగిపోయింది. వీపు, పొత్తికడుపుపై శస్త్రచికిత్స చేశారు. ట్రీట్మెంట్ తర్వాత కారీ తన కుటుంబంతో ఆస్ట్రేలియా వెళ్లింది. రెండు దశాబ్ధాల అనంతరం ఇప్పుడిప్పుడే ఆమె నడక మొదలు పెట్టింది. ఆ ప్రమాదం జరిగిన పదేళ్ల తర్వాత కానీ ఆమె శరీరంలోని కింద భాగం అనుభూతిలోకి రాలేదు, ఆమె బ్లాడర్, ప్రేగుల పనితీరు నియంత్రణ లేదు. అయినప్పటీకి బతికి ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. తన భయంకరమైన అనుభవాలను చెబుతూ.. ‘ ది గర్ల్ హూ ఫెల్ ఫ్రమ్ ది స్కై’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది.