White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ‘వైట్ లంగ్ సిండ్రోమ్’ అని పిలువబడుతున్న బ్యాక్టీరియా, న్యూమోనియా కొత్త వ్యాప్తిగా చెప్పబడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి చైనాతో పాటు డెన్మా్ర్క్, అమెరికా, నెదర్లాండ్స్‌లోని పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మూడు నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తోంది.
స్కాన్‌లలో ఉపిరితిత్తులు దెబ్బతిన్నడం కనిపించే దాన్ని బట్టి ‘వైట్ లంగ్ సిండ్రోమ్ న్యూమోనియా’ అనేది పేరు పెట్టారు. మైకోప్లాస్మా న్యూమోనియా వల్ల ఇది వస్తుంది. అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ఇచ్చే యాంటీబయాటిక్స్‌కి కూడా అంత సామాన్యంగా లొంగడం లేదు.
డెన్మార్క్‌లో పిల్లల్లో ఈ న్యూమోనియా కేసులు అంటువ్యాధి స్థాయికి చేరుకున్నాయి. నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లకు సంబంధించిన కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి దగ్గు, తుమ్ము, మాట్లాడటం, పాడటం మరియు శ్వాస తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. మైనస్‌క్యూల్ రెస్పిరేటరీ బిందువులు ఈ వ్యాధిని ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేలా చేస్తున్నాయి.
Read Also: Anju Love Story: పాక్ నుంచి ఇండియాకు వచ్చిన అంజూ.. “మా అమ్మను కలిసేది లేదంటున్న పిల్లలు..”
అమెరికాలోని ఓహియోలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆస్పత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్య పెరగుతోంది. US న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, చైనాతో టచ్‌లో ఉందని, అమెరికాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు నోవల్ వ్యాధి కారకాలు కారణం కాదని సూచించింది.
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది న్యూమోనియాకు సంబంధించిన తీవ్రమైన రూపం. ఇది ఉపరితిత్తులను దెబ్బతీస్తూ మచ్చులు, పాలిపోయిన రంగుకు కారణమవుతుంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియనప్పటికీ.. ఇది బ్యాక్టీరియా, వైరస్, పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తుందని నమ్ముతున్నారు.
లక్షణాలు: జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి, అలసట.