Melodi: యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28)ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టను రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు.
Bunker Buster Bomb: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల వారం రోజుల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరింది. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే తాజాగా సంధి ముగియడంతో మరోసారి యుద్ధం ప్రారంభమైంది. అయితే సంధి కాలంలో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి జరిగింది, దీని వల్లే మళ్లీ యుద్ధం ప్రారంభమైందని అమెరికా ఆరోపిస్తోంది.
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకస్థాపన కోసం వడివడిగా పనులు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక అందించింది.
Khalistan: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాటువాద నేతలు యాక్టీవ్ అవుతున్నారు. ముఖ్యంగా కెనడా, యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వారి కార్యకలాపాలు పెరిగాయి. భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఇదే కాకుండా ఖలిస్తానీ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని హతమర్చాడానికి ప్రయత్నించడంతో పాటు భయాందోళనకు గురిచేస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అక్కడ హిందువులను టార్గెట్ చేసుకుంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులకు పాల్పడ్డాడు.
Israel-Hamas: హమాస్ దాడి తర్వాత ఆ సంస్థను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని గోల్డా మీర్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన శత్రువులను చంపేందుకు ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’ లాంటి మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే హమాస్ కీలక నేతల్ని చంపేందుకు నెతన్యాహు ఇజ్రాయిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్’ని ఆదేశించారు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకత్వం టర్కీ, లెబనాన్, ఖతార్ దేశాల్లో తలదాచుకుంటున్నారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.
Cocaine: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. పోర్టులోని ఓ ఓడలో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పారదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద లంగర్ వేసి ఉన్న ఓడలోని క్రేన్‌లో 22 అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయని వారు వెల్లడించారు.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
Mine Collapse: ఆఫ్రికా దేశం జాంబియాలో గని ప్రమాదం జరిగింది. అక్రమంగా ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు పేరుగాంచిన జాంబియాలో రాగి గని కుప్పకూలడంతో 30 మంది అందులోనే చిక్కుకుపోయినట్లు ఆ దేశ మంత్రి శుక్రవారం తెలిపారు. చింగోలాలోని ఈ ప్రమాదం జరిగినట్లు హోం వ్యవహరాల మంత్రి జాక్మ్వింబు పార్లమెంట్లో తెలిపారు.
PM Modi: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సినఅ అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.