Electricity bill: ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలతో కొందరి కోట్ల రూపాయల బిల్లులు రావడం చూస్తు్న్నాం. తర్వాత విద్యుత్ అధికారులు తమ తప్పులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు రూ.4950 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఏకంగా రూ. 197 కోట్ల చెల్లింపు రసీదును ఇచ్చింది. బిల్లులను టాలీ చేసుకునేప్పుడు, లెక్కలు చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. లక్నోలోని సీనియర్ విద్యుత్ అధికారులు కూడా ఈ బిల్లు వ్యవహారంపై సమచారాన్ని కోరారు.
Read Also: IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారీ మార్పులతో ఇరుజట్లు
అసలు ఈ తప్పిదం ఎలా జరిగిందంటే.. విద్యుత్ కనెక్షన్ నెంబర్ 197****000 కలిగిన మహిళకు రూ. 4950 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లును చెల్లించేందుకు తన కొడుకును పంపింది. విద్యుత్ బిల్లు చెల్లించిన తర్వాత ఆపరేటర్ రూ.197 కోట్ల రసీదు ఇచ్చాడు. అయితే విద్యుత్ ఆపరేటర్ బిల్లుకు కేటాయించిన కాలమ్‌లో వినియోగదారుడి 10 అంకెల కనెక్షన్ నెంబర్ ఎంటర్ చేశాడు. దీంతో ఈ చిన్న తప్పు మొత్తం విద్యుత్ డిపార్ట్మెంట్‌లో గందరగోళాన్ని సృష్టించింది. ఆ తర్వాత లక్నోలని శక్తి భవన్‌లో ఉన్న డేటా సెంటర్ సూచనల మేరకు చెల్లింపు రద్దు చేశారు. బిల్లు అమౌంట్‌కు బదులుగా క్యాషియర్ వినియోగదారుల కనెక్షన్ ఐడీ నంబర్‌ను నమోదు చేశారని గోరఖ్‌పూర్ డిస్ట్రిబ్యూషన్ చీఫ్ ఇంజనీర్ అషు కలియా తెలిపారు. టైప్ చేస్తున్న సమయంలో లోపం ఏర్పడటంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు.