Henry Kissinger: ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ కిస్సింజర్ తన 100వ ఏట కన్నుమూశారు. భారత్‌తో అమెరికా బంధాన్ని మరింతగా బలపరుచుకోవాలని కోరుకున్న నేతగా కిస్సింజర్కి పేరుంది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ యూఎస్ పర్యటనలో వీల్ చైర్లో ఉండీ కూడా కిస్సింజర్ హాజరయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లంచ్‌లో మోడీ స్పీచ్ వినేందుకు ఆయన వచ్చారు. ప్రధాని మోడీతో ముచ్చటించారు.
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, ‘సిఖ్ ఫర్ జస్టిస్’ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ కేసులో భారతీయుడిపై అమెరికా అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తా అనే 54 ఏళ్ల వ్యక్తి పన్నూ హత్యకు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తుంది. పన్నూ హత్యకు సంబంధించి అంతకు ముందు యూఎస్ ప్రభుత్వం భారత్‌ని హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం కాదని భారత్ స్పష్టం చేసింది.
Lithium Mining: ప్రపంచంలోనే అత్యంత విలువైన మూలకాల్లో ఒకటిగా ఉన్న లిథియం, కోబాల్ట్, టైటానియం, కోబాల్ట్ మూలకాల వేలాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. తొలి విడతగా 20 బ్లాకులను వేలం వేయనున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటి విలువ రూ. 45,000 కోట్లు ఉంటుందని చెప్పారు.
Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. "లియో" పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.
Kia Sonet facelift: కొరియన్ కార్ మేకర్ కియా భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి స్థానాన్ని సంపాదించింది. కియా నుంచి సోనెట్, సెల్టోస్, కారెన్స్, ఈవీ6 వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పటికే తన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసిన కియా, తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ అయిన సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Taliban: ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్ వెల్లడించింది.
India at UN: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానిన ఐక్యరాజ్య సమితి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలిచింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 91 దేశాల్లో భారత్ కూడా ఉంది.
Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో దారుణం జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఇద్దరు నర్సరీ విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల ముగించుకుని ఇంటికి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అప్పటికే అందరు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద వదిలిని డ్రైవర్, చివరకు ఇద్దరు నర్సరీ విద్యార్థినులు ఉంటడంతో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
USA: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ అనే వ్యక్తి తాత, అమ్మమ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), బింధు బ్రహ్మభట్(72), యష్ కుమార్ బ్రహ్మభట్(38)లను కాల్చి చంపాడని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ విభాగం, మిడిల్ సెకస్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్ ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఇంటిలో నుంచి కాల్పులు శబ్ధం విన్నట్టు ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి…
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి సంధి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.