BJP MP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను ఏకం చేస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన యాత్రలో ముస్లింలు అందరూ పాల్గొంటున్నారని, దానికి సంబంధించిన వీడియో రుజువు తన వద్ద ఉందంటూ చెప్పారు.
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు కదుపుతున్నాడు.
Asaduddin Owaisi: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ఈ రోజు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. అయితే, నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని ఎగతాళి చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘‘ ఎల్కే అద్వానీకి భారతరత్న దక్కింది. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేదీ కాదు’
Nexon iCNG: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్ ఈవీ వాహనాలు ఉండగా.. త్వరలో హారియర్ ఈవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చని ఆదేశాలను కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని అన్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి వరసగా అక్కడి కోర్టులు శిక్షల్ని విధిస్తున్నాయి. తాజాగా ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధంగా వివాహం చేసుకున్నాడనే కేసులో ఆయనకు, అతని భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2022 నుంచి ఇది ఇమ్రాన్ ఖాన్‌పై నాలుగో ఆరోపణ. అయితే, రెండు వరస వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం (ఇద్దత్) పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఆరోపిస్తూ బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ మనేకా కేసు నమోదు చేశాడు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు.
Bharat Ratna Award Winners: బీజేపీ కురువృద్ధులు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ఈ రోజు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ని ప్రకటించింది. 1954న స్థాపించబడిని ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, క్రీడలతో సహా వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారికి ప్రదానం చేస్తున్నారు.
Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఈరోజు భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రదానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, నా జీవితాంత నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరమని అన్నారు. 96 ఏళ్ల అద్వానీ తాను 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి సమయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ సిద్ధాంత గురువు ఆర్ఎస్ఎస్ అప్పగించిన ఏ…