Andhra Sweet Corn Vada: క్రిస్పీ.. క్రిస్పీగా నోరూరించే ఆంధ్రా స్టైల్ స్వీట్ కార్న్ వడలు స్నాక్‌లలో సరికొత్తగా అద్భుతంగా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ వడ / స్వీట్ కార్న్ గారెలను చాలా ఈజీగా ఇంట్లో చేసుకుకోవచ్చు. రుచిలో గారెల్లలా ఉండి.. కార్న్ వల్ల ప్రత్యేకమైన తీపి టచ్ వస్తుంది. టిఫిన్ లేదా భోజనానికి సైడ్ డిష్‌గా బాగా సెట్ అవుతుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Trump-Venezuela: వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన
స్వీట్ కార్న్ వడలకి ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు ప్రధానంగా వాడతారు. ముందుగా కార్న్ గింజలను కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేయాలి. పూర్తిగా పేస్ట్ చేయకూడదు, కొంచెం ముక్కలు ఉంటే వడకి మంచి బైట్ వస్తుంది. దీనిలో నానబెట్టిన శనగ పప్పు, కొద్దిగా బియ్యం పిండి, శెనగ పిండి, అల్లం, పచ్చిమిర్చి వేసి కలపాలి. రుచికి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుంటే చాలు. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న వడలుగా చేసి మధ్యలో చిన్న రంధ్రం పెట్టాలి. నూనె బాగా వేడయ్యాక మోస్తరు మంటపై వడలను వేయించాలి. ఎక్కువ మంట ఉంటే కార్న్ లోపల ఉబ్బి చిట్లే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా వేయిస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తాయి. ఈ వడలు వేయించిన వెంటనే తింటేనే బాగా ఉంటాయి. కొద్దిసేపు ఉంచితే క్రిస్పీనెస్ తగ్గుతుంది. టమాటో సాస్, పచ్చి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉంటాయి. రసం అన్నంతో భోజనానికి సైడ్ డిష్‌గా బాగుంటాయి. సాధారణ ఉల్లిపప్పు గారెల్లకు బదులుగా ఇది మంచి రుచికిని అందిస్తాయి. ఒకవేళ పిల్లల కోసం చేసినట్లయితే.. మిర్చి తగ్గించాలి. మరింత క్రిస్పీ కావాలంటే బియ్యం పిండి కొంచెం పెంచుకోవచ్చు. మిగిలిన వడలను ఎయిర్ ఫ్రయర్‌లో కొద్దిసేపు వేడి చేస్తే మళ్లీ తినచ్చు. ఇంట్లో అందరికీ నచ్చే, త్వరగా అయ్యే కార్న్ స్నాక్ ఇదే.