Nexon iCNG: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్ ఈవీ వాహనాలు ఉండగా.. త్వరలో హారియర్ ఈవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Read Also: Rahul Gandhi: జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించింది..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాటా CNG కార్లపై కూడా దృష్టి సారించింది. టాటా నుంచి ఇప్పటికే టాయాగో, టిగోర్, పంచ్ మోడళ్లలో CNG కార్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తన నెక్సాన్‌ని CNGలో తీసుకురాబోతోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2024లో నెక్సాన్ iCNG కారుని ఆవిష్కరించింది.
భారతదేశంలో తొలిసారిగా “టర్బో పెట్రోల్ CNG” కారుగా నెక్సాన్ రాబోతోంది. దీంతో పవర్ పరంగా నెక్సాన్ ఏ మాత్రం పెట్రోల్ కార్లకు తీసిపోకుండా ఉండబోతోంది. నెక్సాన్ CNG 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 118 bhp శక్తిని మరియు 170 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. Nexon iCNG టాటా యొక్క ప్రసిద్ధ ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. టాటా 230 లీటర్ల బూట్ స్పేస్‌ని క్లెయిమ్ చేస్తోంది. ట్విట్ సిలిండర్ టెక్నాలజీ ద్వారా బూట్ స్పేస్‌ని పెంచుతోంది. భవిష్యత్తులో డీజిల్ నిలిపివేయగల సెగ్మెంట్లలో CNGని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు టాటా ఇంతకుముందు పేర్కొంది. త్వరలోనే Nexon iCNG కారుని మార్కెట్లో చూసే అవకాశం ఉంది. నెక్సాన్ ప్రత్యర్థిగా పరిగణించబడుతున్న మారుతి సుజుకి బ్రెజ్జాలో ఇప్పటికే సీఎన్‌జీ అందుబాటులో ఉంది.