Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.
Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్‌ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది.
Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు.
CAA: కేంద్రమంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారత్ అంతటా CAA అమలు చేయబడుతుందని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని కక్‌ద్వీప్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఈ హామీని ఇచ్చారు.
RSS: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని ‘ నో డ్రోన్’ జోన్‌గా ప్రకటించారు. అనేక ఉగ్రసంస్థలతో పాటు సంఘవ్యతిరేక శక్తులకు ఆర్ఎస్ఎస్ ప్రధాన టార్గెట్‌గా ఉండటంతో నాగ్‌పూర్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 (1) (3) కింద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్‌కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్‌తో సహా అనేక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించింది.
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Nagpur: జైలు నుంచి పెరోల్‌పై వచ్చినా కూడా అతని బుద్ధి మారలేదు. ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. ఒక హత్య కేసులో దోషిగా తేలిని వ్యక్తికి ఇటీవల పెరోల్ మంజూరైందని, ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Sanjay Raut: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టాడు. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్, ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఆ కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టాయి.