Anti-cheating bill: ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పరీక్షా పత్రాల లీక్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ చీటింగ్ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు’’ తదుపరి రాజ్యసభ ఆమోదం కోసం వెళ్లింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారనుంది.
Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
Dell: కరోనా మహమ్మారి కారణంగా అన్ని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) ప్రకటించాయి. అయితే, ఇప్పటికీ కొందరు ఉద్యోగులు ఇంకా రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఒకవేళ రాకుంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Blood Cancer: అత్యంత తీవ్రమైన క్యాన్సర్లలో ‘బ్లడ్ క్యాన్సర్’ ఒకటి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వైద్యులు కీమోథెరపీని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, చండీగఢ్ వైద్యులు మాత్రం కీమోథెరపీ ఉపయోగించకుండా ఒక రకమైన రక్త క్యాన్సర్ చికిత్సను కనుగొన్నారు. అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (ఏపీఎల్)తో బాధపడుతున్న రోగులు చికిత్స తర్వాత పూర్తిగా నయమయ్యారని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యులు తెలిపారు.
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది.
Man Sets Wife On Fire: మద్యం తాగుతుండగా భార్యభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో భార్య అతడితో వాగ్వాదానికి దిగింది. గొడవ తీవ్రం కావడంతో సదరు వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
Helmets: తన కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు వినూత్నమైన గిఫ్ట్స్ అందించాడు ఆ తండ్రి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వివాహానికి వచ్చిన వారికి ఉచితంగా హెల్మెట్లను గిఫ్టులుగా ఇచ్చాడు. ఛత్తీస్‌గఢ్ కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం జరిగిన తన కుమార్తె పెళ్లిలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశారు.
INDIA Bloc: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి తన స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలిగి మళ్లీ బీజేపీతో జతకట్టాడు. మరోవైపు కాంగ్రెస్‌తో టీఎంసీ, ఆప్ పార్టీలకు మధ్య సీట్ల షేరింగ్ గురించి విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేయగా.. ఆప్ కూడా పంజాబ్,…
Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలిచింది. గతంలో పలుమార్లు ఈ రైలులో వడ్డించిన భోజనంలో దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఫిబ్రవరి 1న రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
Live-in relationship: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా ఈ బిల్లులోని కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై కీలక నియమ నిబంధనలను తీసుకువచ్చింది.